విడుదల తేదీ : అక్టోబర్ 11, 2019
123తెలుగుtv.in రేటింగ్ : 2.5/5
నటీనటులు : పాయల్ రాజ్ పుత్, తేజూస్ కంచర్ల, ఆదిత్య మీనన్, నరేష్,తులసి, చమ్మక్ చంద్ర,ఆమని, ముమైత్ ఖాన్, విద్యులేక రామన్ తదితరులు.
దర్శకత్వం : శంకర్ భాను
నిర్మాతలు : సి.కళ్యాణ్
సంగీతం : రథన్
సినిమాటోగ్రఫర్ : సి.రాంప్రసాద్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ఆరెక్స్ 100 మూవీతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ చేసిన మరో బోల్డ్ అటెంప్ట్ ఆర్డీఎక్స్ లవ్. విజయవంతమైన ఆరెక్స్ 100మూవీ ని తలపిస్తున్న టైటిల్ తో పాటు, మసాలా ట్రైలర్స్ తో మూవీపై అంచనాలు ఆకాశానికి లేపారు. మరి పాయల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ఏ మేరకు అంచనాలు అందుకుందో సమీక్షలో చూద్దాం.
కథ:
అలివేలు (పాయల్ రాజ్ పుత్) ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ సంపాదించడం కొరకు సేఫ్ సెక్స్, మరియు కుటుంబ నియంత్రన వంటి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలలో అవగాహన కల్పించే సోషల్ యాక్టవిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తన లక్ష్యం సాధించడానికి తేజూస్ కంచర్ల ప్రేమను వాడుకోవాలని భావిస్తుంది. అసలు అలివేలు ఎవరు? తాను ముఖ్యమంత్రి ని ఎందుకు కలవాలని అనుకుంటుంది? దానికోసం హీరో తేజూస్ ప్రేమని ఎందుకు ఉపయోగించుకోవాలనుకుంటుంది ? ఆమె ముఖ్యమంత్రిని కలిసిందా? వారిద్దరి ప్రేమ ఎలా ముగిసింది? అనేది తెరపైన చూడాలి.
ప్లస్ పాయింట్స్:
మొదటిసారి లేడీ ఓరియెంట్ మూవీలో అవకాశం దక్కించుకున్న పాయల్ ఆసాంతం అన్నీ తానై మూవీని నడిపించింది. ఆరోగ్యకరణమైన శృగారం గురించి చెప్పే క్రమంలో ఆమె వాడే పదాలు, డైలాగ్స్ వల్గర్ గా ఉన్నప్పటికీ ఆ కోణం ఆశించి వెళ్లిన ఆడియన్స్ ని సంతృప్తి పరిచాయి. ఇక హీరో తేజూస్ తో ఆమె చేసిన రొమాంటిక్ సన్నివేశాలు మరో మారు ఆరెక్స్ 100మూవీని తలపించాయి. బోల్డ్ హీరోయిన్ గా పేరున్న పాయల్ మూవీ నుండి ఈ రెండు అంశాలు ఆశించి వెళ్లిన ఆడియన్స్ కి కావలసినంత ఎంటర్టైన్ మెంట్ దొరికింది.
ఈ మూవీలో చెప్పుకోవాల్సిన మరొక నటుడు ఆదిత్య మీనన్. ప్రధాన విలన్ పాత్రలో ఆయన అన్నివిధాలుగా అలరించారు. బేసిక్ గా మంచి నటుడైన ఆదిత్య మీనన్ తన హావభావాలతో మరియు డైలాగ్స్ మాడ్యులేషన్స్ తో కట్టిపడేసారు. పాయల్ తనకు మధ్య నడిచే సన్నివేశాలలో ఆయన నటన ఆకట్టుకుంది.
ఇక హీరోగా చేసిన తేజూస్ కంచర్ల గత చిత్రాలతో పోల్చుకుంటే నటనలో పరిపక్వత కనబరిచాడు. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, రొమాంటిక్ సన్నివేశాలలో తేజూస్ నటన సహజంగా అనిపించింది. ఇక సీఎం పాత్రలో బాపినీడు పరవాలేదని పిస్తారు. సీనియర్ నటుడు నరేష్ తక్కువ నిడివి గల గ్రామస్థుడిగా భావోద్వేగ సన్నివేశాలలో చక్కని నటన కనబరిచారు.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు కథను చెప్పే విధానం ఎక్కడా ఉత్కంఠ కలిగించదు, ఆసక్తి కలిగించని కథనం, నిర్జీవమైన సన్నివేశాలు పరీక్ష పెడతాయి. మొదటిసగంలో సోషల్ యాక్టివిస్ట్ గా పాయల్ చెప్పే డైలాగ్స్ చాలా బోల్డ్ గా అడల్ట్ కామెడీతో సాగాయి. ఫ్యామిలీ ప్రేక్షకులకు ఏమాత్రం సహించని రీతిలో ఆ డైలాగ్స్ ఉండటం ఒక మైనస్ గా చెప్పొచ్చు.
అసలు కథను చెప్పడానికి మొదటిసగం మొత్తం అర్థం లేని సన్నివేశాలతో బోర్ కొట్టించిన దర్శకుడు, ఒక వరుస, మరియు పొంతలేని సన్నివేశాలతో మరింత విసిగించాడు. అనేక ఎపిసోడ్స్ అసలు కథకు సంబంధం లేకుండా సాగడంతో పాటు, మూవీ నిడివి పెంచేశాయి.
ఆరెక్స్ 100 అంత పెద్ద విజయం కావడానికి ఆసక్తికరమైన కథ, అనుకోని మలుపులతో కూడినది కావడమే. కానీ ఈ మూవీ అవసరానికి మించి రొమాన్స్ కురిపించి ప్రధానమైన కథపై ద్రుష్టి సారించలేదు. కథలో భాగంగా వచ్చే రొమాన్స్ కి విలువ వుంటుంది, కానీ, రొమాన్స్ బోల్డ్ సీన్స్ చూపించడానికి కథ రాసుకుంటే ఇలాగే ఉంటుంది.
అసలు ఏమాత్రం జీవంలేని కథకు దర్శకుడు ఇచ్చిన ముగింపు కూడా సిల్లీగా ఉంది. కథ అనేక మార్లు డైవర్షన్స్ తీసుకుంటూ అనవసరమైన ఎపిసోడ్స్ తో నిడివి ఎక్కువైపోయింది. ఇదికూడా మూవీకి పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు.
అసలు ఏమాత్రం జీవంలేని కథకు దర్శకుడు ఇచ్చిన ముగింపు కూడా సిల్లీగా ఉంది. కథ అనేక మార్లు డైవర్షన్స్ తీసుకుంటూ అనవసరమైన ఎపిసోడ్స్ తో నిడివి ఎక్కువైపోయింది. ఇదికూడా మూవీకి పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు.
సాంకేతిక విభాగం:
చిన్న చిత్రం అయినప్పటికీ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ రాజీ లేకుండా మూవీ తెరకెక్కించారనిపించింది. ఇక కెమెరా వర్క్ ఆకట్టుకుంది. పల్లె వాతావరణం, అక్కడి కల్చర్ చక్కగా బందించి తెరపై ఆవిష్కరించారు. రథన్ అందించిన పాటలు, అలాగే బీజీఎమ్ గుడ్, ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ పూర్తిగా వైఫల్యం చెందింది.
మంచి సబ్జెక్టు ఎంచుకున్న దర్శకుడు శంకర్ భాను దానిని చెప్పే క్రమంలో ప్రక్కదారి పట్టాడు. కథకు అవసరంలేని అనేక సన్నివేశాలతో మూవీ ఫ్లో దెబ్బతీశారు. హీరోయిన్ పాయల్ సేఫ్ సెక్స్ ప్రచారం, గుట్కా బ్యాన్ వంటి సన్నివేశాలు చాలా సిల్లీగా కథకు అవసరమా అనిపిస్తాయి. పాయల్ చేత చెప్పించే అడల్ట్ కామెడీ డైలాగ్స్ కథకోసం కాకుండా బోల్డ్ నెస్ కోసం జొప్పించినట్లు అనిపిస్తుంది.ఏమాత్రం ఆకట్టుకొని స్క్రీన్ ప్లే మూవీ ప్రేక్షకుడిపై ఎక్కడా పట్టుసాధించదు.
తీర్పు:
మొత్తంగా ఆర్డీఎక్స్ లవ్ మూవీ ఏమాత్రం ఆకట్టుకోని సీరియస్ డ్రామా గా చెప్పొచ్చు. ఏమాత్రం ఆకట్టుకొని కథ, కథనాలతో సాగే ఈ చిత్రంలో పాయల్ గ్లామర్ కొంచెం ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ చూసి ఫుల్ టైం రొమాంటిక్ మూవీ అని వెళితే పప్పులో కాలేసినట్టే. కథకు అవసరం లేకున్నా జోడించిన బోల్డ్ డైలాగ్స్ మరియు మసాలా సీన్స్ మూవీని కాపాడలేకపోయాయి.
123telugutv.in Rating : 2.5/5
Reviewed by 123telugutv Team