తిప్పరా మీసం తెలుగు మూవీ రివ్యూ 2019 _ 123telugu

  • విడుదల తేదీ : నవంబర్ 8, 2019
    123తెలుగుటీవీ. ఇన్ : 2.75/5
    నటీనటులు : శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి తదితరులు
    దర్శకత్వం : కృష్ణ విజయ్ఎల్
    నిర్మాత‌లు : రిజ్వాన్
    సంగీతం : సురేష్ బొబ్బిలి
    సినిమాటోగ్రఫర్ : సిధ్
    ఎడిటర్: :ధర్మేంద్ర కాకర్ల

    యంగ్ హీరో శ్రీవిష్ణు – నిక్కీ తంబోలి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం తిప్ప‌రా మీసం. కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
    కథ :
    మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్న తనంలోనే డ్రగ్స్ కి ఎడిట్ అయి.. ఆ క్రమంలో చివరికి తన తల్లి(రోహిణి) పైనే ద్వేషం పెంచుకుని ఆమెను శత్రువులా చూస్తుంటాడు. అయితే ఇలాంటి మణిశంకర్ పెరిగి పెద్దయ్యాక ఒక పబ్ లో డీజే గా పని చేస్తూ.. విపరీతంగా బెట్టింగ్స్ చేస్తూ కొన్ని ఆర్ధిక సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ మధ్యలో మౌనిక (నిక్కీ తంబోలి)తో ప్రేమలో పడతాడు. మరో పక్క తనకు వచ్చిన సమస్యల నుండి బయట పడటానికి డబ్బు కోసం ఇల్లీగల్ గేమ్స్ ఆడుతుంటాడు. వాటి కారణంగా అతని జీవితం ఉహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ మణిశంకర్ జీవితంలో చోటు చేసుకున్న ఆ మలుపు ఏమిటి? చివరికీ తన తల్లి ప్రేమను అతను అర్ధం చేసుకుంటాడా? లేదా? అసలు అతను తల్లిని అంతగా ద్వేషించడానికి కారణం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.
    ప్లస్ పాయింట్స్ :
    ప్ర‌పంచంలో అన్ని మారినా.. అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ మార‌దు. అలాంటి అమ్మ ప్రేమను ఈ సినిమాలో బలంగా చూపించటానికి చేసిన ప్రయత్నం మెచ్చుకోతగినిది. కథ సింపుల్ గా ఉన్న కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరో మారే సన్నివేశాల క్రమం మరియు క్లైమాక్స్ అలాగే మెయిన్ గా హీరో తల్లి దగ్గరకి వచ్చి క్షమాపణ కోరే సీన్ చాల బాగుంది. ఇక శ్రీవిష్ణు మణిశంకర్ పాత్రలో అద్భుతంగా నటించారు. క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ బాగానే ఉంది.
    ఇక సీనియర్ నటి రోహిణి కూడా అమ్మ‌పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. కొడుకు మీద ప్రేమను వ్యక్త పరిచే ప్రతి సన్నివేశంలో ఆమె నటన ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ గా నటించిన నిక్కీ తంబోలి కొన్ని లవ్ సీన్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే హీరోకి మామయ్య పాత్రలో కనిపించిన బెనర్జీ మరియు చెల్లిగా నటించిన నటి కూడా బాగా నటించారు. ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు.
    మైనస్ పాయింట్స్:
    దర్శకుడు కృష్ణ విజ‌య్‌ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మరియు ప్రీ ఇంటర్వెల్ లో గేమ్ యాక్షన్ సీక్వెన్స్ స్ పర్వాలేదనిపించినా.. స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది. దానికి తోడు కొన్ని మెయిన్ సన్నివేశాలు కూడా బోర్ కొడతాయి. పైగా ఫస్టాఫ్ లో ల్యాగ్ సీన్స్ బాగా ఎక్కువయ్యాయి.
    ఇక సినిమాలో హీరో చుట్టూ సాగే డ్రామా మరియు బలహీనమైన సంఘర్షణకి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. అయితే దర్శకుడు హీరో జర్నీని బలంగా ఎలివేట్ చేసినప్పటికీ.. హీరోకి ఎదురయ్యే సమస్యలను కానీ.. హీరో పాత్రకి అతని తల్లి పాత్రకు మధ్య వచ్చే సంఘర్షణ గానీ ఆ స్థాయిలో లేవు. వారిద్దరి మధ్య సన్నివేశాలను ఇంకా బలంగా రాసుకోవాల్సింది.
    అయితే దర్శకుడు సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ స్లోగా సాగుతూ (క్లైమాక్స్ మినహా ) బోర్ కొడుతోంది. సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి చాల ప్లస్ అయ్యేది. అలాగే ఎండింగ్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
    సాంకేతిక విభాగం :
    సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. సురేశ్ బొబ్బిలి పాటల్లో లవ్ సాంగ్ బాగుంది. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించాల్సింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు సరైన కథాకథనాలను రాసుకోలేకపోయారు.
    తీర్పు :
    శ్రీవిష్ణు – నిక్కీ తంబోలి హీరోహీరోయిన్లుగా మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నా.. కథాకథనాలు స్లోగా సాగుతూ సినిమా ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయాడు. అయితే సినిమాలో శ్రీవిష్ణు యాక్టింగ్ అండ్ తల్లి సెంటిమెంట్ ఆకట్టుకుంటాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
    123telugutv.in Rating : 2.75/5
    Reviewed by 123telugutv Team

  • Thippara Meesam First Show Full Details 2019

  • Meesam is a action thriller directed By Asura fame Krishna Vijay and produced by Rizwan. The movie cast includes Sri Vishnu and Nikki Tamboli are played the main lead roles while Suresh Bobbili scored music.

  • తిప్పరా మీసం తెలుగు మూవీ రివ్యూ 2019

  • ఇప్పుడు శ్రీవిష్ణు మరియు అతని కుటుంబం మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇప్పుడు సినిమా శ్రీ విష్ణును పోలీసులు టార్చర్ చేస్తున్న మొట్ట మొదటి సీన్ కు కనెక్ట్ అయ్యింది.

  • ఇప్పుడు కథనంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.ఒక హత్య కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.

  • ఇప్పుడు సినిమాలో మరో బెట్టింగ్ కు రంగం సిద్ధం అయ్యింది.ఈ బెట్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని శ్రీవిష్ణు ప్రయతిస్తున్నాడు.

  • ఇప్పుడు శ్రీవిష్ణు ఆ కేసును గెలిచి డబ్బులు సొంతం చేసుకున్నాడు.ఈ ఆనందంలో దేథడి పాట మొదలయ్యింది.

  • ఇప్పుడు శ్రీ మరియు అతని తల్లికి మధ్య ఒక కోర్టు కేసు సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇంటర్వెల్ అనంతరం మౌన హృదయ రాగమే పాట మొదలయ్యింది.ఈ పాట ద్వారా నిక్కీ నుంచి బ్రేకప్ అయిన తన ప్రేమను మళ్ళీ పొందేందుకు శ్రీవిష్ణు ప్రయత్నిస్తున్నాడు.

  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసినట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కేవలం శ్రీ విష్ణు టేకింగ్ మీదనే కొనసాగుతూ వెళ్ళింది.అలాగే ఫస్ట్ హాఫ్ లో కెమెరా పనితనం మరియు సంగీతం మంచి ఎస్సెట్ గా అనిపించాయి.కానీ సినిమా అసలు కథలోకి ఇంకా ఎంటర్ కాలేదు.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

  • డ్రగ్స్ కు సంబంధించి ఒక ఆసక్తికర ఎపిసోడ్ తో సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.

  • శ్రీవిష్ణు బెట్ ను ఓడిపోయాడు.జూదానికి బానిస అయ్యిపోయిన శ్రీ దాని పరిహారం చెల్లించడానికి అనేక దారులు వెతుకుతున్నాడు.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • ఇప్పుడు ఓ అడవిలో శ్రీవిష్ణు మరియు అతని సహచరుల మధ్య మరో బెట్టింగ్ సీన్ వస్తుంది.

  • ఇప్పుడు రాధా రమనం పాట వస్తుంది.ఈ పాటలో వస్తున్న సంగీతంతో పాటుగా శ్రీవిష్ణు స్టైలింగ్ కూడా బాగుంది.

  • హీరోయిన్ నిక్కీ తంబోలి ఇప్పుడు పరిచయం అయ్యింది.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • ఇప్పుడు శ్రీవిష్ణు పాత్రకు సంబంధించి అతను మరియు అతని కుటుంబ సభ్యులతో కూడిన సన్నివేశాలు వస్తున్నాయి.ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో ఫ్లాష్ బ్యాక్ కు చిత్రం వెళ్ళింది.

  • బ్లాక్ అండ్ వైట్ లో మొదలయిన మొట్టమొదటి చిత్ర సన్నివేశం ఇప్పుడు కొంత కాలం వెనక్కి వెళ్లి కలర్ లోకి మారింది.ఇప్పుడు అండర్ వాటర్ బెట్టింగ్ సీన్ వస్తుంది.

  • సినిమా మొదలు కావడమే ఒక హింసాత్మక సన్నివేశంతో మొదలయ్యింది.ఇప్పుడు శ్రీవిష్ణు తన మీసాన్ని షేవ్ చేసుకుంటున్నాడు.

  • హాయ్..158 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

Post a Comment