ఎన్టీఆర్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్-కెరియర్ లో ఇలా ఫస్ట్ టైం | Jr NTR New Movie Update 2020 RRR Movie Update

ఎన్టీఆర్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్

Jr NTR New Movie Update 2020 RRR Movie Update-123telugutv.in
Jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.

అసలు విషయంలోకి వెళ్తే  ఎన్టీఆర్ తన సినీ కెరియర్ మొదలుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది .ఎన్టీఆర్ ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు విడుదల చేసారు .కనీసం ఏడాదికి ఒక్క సినిమా ఐన విడుదల ఐయ్యేది .ఐతే జక్కన తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కారణంగా రెండు సంవత్సరాలు అయన వెండితేరా మీద కనిపించట్లేదు .ఎన్టీఆర్ 2019 లో ఒక్క సినిమా కూడా చేయలేదు .అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమాను 2021 జనవరి 8 న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.అందువల్ల 2020 లో కూడా ఎన్టీఆర్ ని మనం వెండి తేరా మీద చూడలేం .

ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా కారణం గ ఎన్టీఆర్ రెండు సంవత్సరాలు ఏ సినిమా విడుదల లేదు .ఇంతకుముందు 2009 లో అయన ఒక సినిమాను కూడా విడుదల చేయలేదు .మల్లి ఇప్పుడు జక్కన కారణంగా 2019 మరియు 2020 లో ఏ సినిమా లేదు .ఎన్టీఆర్ ఫాన్స్ కి ఏది కొంచెం బాధ కరమైన విషయమే .కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయడం తప్పు లేదు అని కొందరు .ఎన్టీఆర్ చివరిగా 2018 అక్టోబర్ లో అరవింద సమేత చిత్రం లో నటించారు .

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బాలీవుడ్ తారలు ఐనా  అలియా బట్ ,అజయ్ దేవగన్ నటిస్తున్నారు .
అజయ్ దేవగన్ ఇటీవలే ఏ చిత్రం షూటింగ్ లో జాయిన్ ఐయ్యారు .అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది .

ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు  కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో  ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.

ఇ సినిమాను 2021 జనవరి 8 న విడుదల చేయనున్నారు .

Post a Comment