ఆర్ ఆర్ ఆర్ మూవీ వాయిదా కి అసలు కారణం అదే !
RRR Movie Update |
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.
సోషల్ మీడియా పుకార్లను నిజం చేస్తూ ఆర్ ఆర్ ఆర్ మూవీ దాదాపు ఆరు నెలలు వాయిదా పడింది. 2020 జులై 30 నుండి 2021 జనవరి 8కి పోస్ట్ ఫోన్ చేసారు చిత్ర యూనిట్ . ఆర్ ఆర్ ఆర్ మూవీ అనుకున్న విధంగా విడుదల అయ్యే అవకాశం లేదని ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. షూటింగ్ మొదలైన కొద్దీ రోజులకే రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు షూటింగ్ సమయంలో గాయాలు కావడం, మరో పక్క రాజమౌళి కొడుకు పెళ్లి కారణంగా మరో రెండు నెలలు గ్యాప్ తీసుకోవడం, బాహుబలి లండన్ ప్రదర్శన కోసం రాజమౌళి అక్కడ ఓ రెండు వారాలు ఉండడం ఇలా అనేక కారణాల వల్ల చిత్రీకరణ జరగలేదు.
ఎన్నిసార్లు వాయిదా పడినా అనుకున్న ప్రకారం జులై 30న సినిమా విడుదల ఉంటుంది అని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 70శాతం షూటింగ్ కూడా పూర్తి చేశాం, వాయిదా పడుతుంది అనే పుకార్లలో నిజం లేదు అని చిత్రయూనిట్ పేర్కొన్నారు. మరి సడన్ గా ఆర్ ఆర్ ఆర్ విడుదల ఏకంగా ఆరు నెలలు ముందుకు జరపడం వెనుక అసలు కారణం ఏమిటనేది ఎవరికి అర్థం కావడం లేదు. అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి కాలేదా లేక, సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకొని భారీ వసూళ్లు రాబట్టాలని ఇలా చేశారా అని చాల మంది భావన .
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బాలీవుడ్ తారలు ఐనా అలియా బట్ ,అజయ్ దేవగన్ నటిస్తున్నారు .
అజయ్ దేవగన్ ఇటీవలే ఏ చిత్రం షూటింగ్ లో జాయిన్ ఐయ్యారు .అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది .
ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.
ఇ సినిమాను 2021 జనవరి 8 న విడుదల చేయనున్నారు .