RRR Movie Special Video - Ram Charan Birthday - RRR Movie Update
![]() |
RRR Movie Update |
Ram Charan First Look From RRR Movie
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.
ఆర్ ఆర్ ఆర్ మూవీ నుంచి ఎట్టకేలకు ఉగాది సందర్భంగా టైటిల్ ను అలాగే లోగోను విడుదల చేసారు చిత్ర యూనిట్ .టైటిల్ లోగో మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చింది.రాజమౌళి తన మార్క్ టైటిల్ లో కనిపిస్తుంది అని అలాగే ఈ లోగో తో ఇంకా అంచనాలు పెచెంసేసారు అని చెబుతున్నారు .ఈ ఫీవర్ తగ్గకముందే మరొక అప్డేట్ తో రానున్నారు . రేపు రామ్ చరణ్ పుట్టినరోజు ఎన్టీఆర్ మాత్రం చరణ్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఈ విషయం గురించి ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘బ్రదర్ రామ్ చరణ్ .. ఐ విష్.. నేను నీ బర్త్ డేను మంచి పరిస్థితులలో జరుపుకున్నాం. కానీ మనం లాక్ డౌన్ లో ఉన్నాము కాబట్టి ఇంట్లో ఉండటం ముఖ్యం. అందుకే రేపు ఉదయం 10 గంటలకు నేను నీకు డిజిటల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము.. ఇది నీకు ఎప్పటికీ మరచిపోలేని బ్యాంగ్’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దానికి చరణ్ కూడా బాగా ఎగ్జైటింగ్ గా వావ్.. వెయిట్ చేయలేను అంటూ రిప్లే ఇచ్చాడు.
ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ హీరోయిన్ గా నటితున్నారు .అజయ్ దేవగన్ ఇటీవలే ఏ చిత్రం షూటింగ్ లో జాయిన్ ఐయ్యారు .అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది .ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.
ఈ సినిమాను 2021 జనవరి 8 న విడుదల చేయనున్నారు