RRR Movie First Look Poster - RRR Movie Title Logo Poster -Jr NTR,Ram Charan,Rajamouli
![]() |
RRR Movie Motion Poster |
RRR Movie Title Announcement Update
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫాన్స్ కి పండగ లాంటి వార్త. ఏంటంటే తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఉగాది సందర్భంగా మోషన్ పోస్టర్ తో పాటు టైటిల్ లోగోను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ మెంట్ పోస్టర్ లో తెలియజేశారు.
ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ హీరోయిన్ గా నటితున్నారు .అజయ్ దేవగన్ ఇటీవలే ఏ చిత్రం షూటింగ్ లో జాయిన్ ఐయ్యారు .అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది .ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.
ఈ సినిమాను 2021 జనవరి 8 న విడుదల చేయనున్నారు .