Johaar Full Movie Review - Latest Telugu Movie Reviews - Johaar Movie Cast And Release Date
నటీనటులు : నైనా గంగూలీ, ఈస్తర్ అనిల్, కృష్ణ చైతన్య
దర్శకుడు : తేజ మర్ని
కథ :
ఈ చిత్రంలో మొత్తం ఐదు భిన్నమైన కథలతో కొనసాగుతుంది, ఓ యువ ముఖ్యమంత్రి(కృష్ణ చైతన్య) తన తండ్రి జ్ఞ్యాపకార్ధం ఒక భారీ విగ్రహాన్ని తన అధికారం ద్వారా నిర్మించాలని పరితపిస్తాడు. అలాగే మరో పక్క ఓ పేద రైతు(ఈశ్వరి రావ్), అథ్లెట్(నైనా గంగూలీ), ఓ టీనేజ్ యువతి (ఈస్తర్) అలాగే ఓ అనాథశ్రయాన్ని నడిపే ముసలాయన(శుభలేఖ సుధాకర్) ల జీవితాలకు ఏమన్నా సంబంధం ఉందా? అతని వల్ల వీరికేమయ్యింది? అలా ఏర్పడిన రాజకీయ పరిణామాలు ఎటు దారి తీశాయి అన్నది అసలు కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో అన్నిటికన్నా మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఎమోషన్స్ చెప్పాలి. సినిమా మొదటి నుంచి చివరి కొనసాగే బలమైన ఎమోషన్స్ చాలా బావుంటాయి. అలాగే ఒకరి కథకు మరొకరి కథ లింకప్ అయ్యి ఉన్న విధానం మెప్పిస్తుంది. అలాగే ఈ చిత్రం ద్వారా వారు అందించిన సందేశం కూడా బాగా వచ్చింది అని చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించిన కృష్ణ చైతన్య ఈ చిత్రంలో ఓ రాజకీయ నాయకునిగా ఎలా కనిపించాలో అలా కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే అతని నటన మరో మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ మరియు ఈశ్వరి రావ్ తమ ఎమోషనల్స్ పెర్ఫామెన్స్ ద్వారా తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు.
అలాగే యువ నటి ఈస్తర్ కూడా తన రోల్ ను చాలా క్లీన్ గా చేసింది. ఇక నైనా గంగూలీ విషయానికి వస్తే ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన ఈమె ఈ చిత్రం ద్వారా ఒక సరికొత్తగా ఆమెను ఆవిష్కరించుకుంది అని చెప్పాలి. అలా తన పెర్ఫామెన్స్ తో నైనా మరో హైలైట్ అయ్యిందని చెప్పాలి. అలాగే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాలో చూపించిన ప్రతీ లొకేషన్స్ లో కెమెరా పనితనం చాలా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ అంతా బాగా కొనసాగుతూ వస్తుంది. కానీ సెకండాఫ్ విషయానికి వస్తే అలా కాస్త నెమ్మదించిన అభిప్రాయం కలుగుతుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే చాలా వరకు ఆడియన్స్ ఊహించగలిగిన విధంగానే ఉంటాయి.
అలాగే ప్రభుత్వంలో ఉండే అధికారులు తమ పవర్ ను ప్రజలకు కాకుండా తమ అవసరాలకు ఎలా వినియోగించుకుంటున్నారు అన్నది కూడా ఇంకా బలంగా ఎలివేట్ అయ్యి ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉండేది.
అలాగే దర్శకుడు ప్రతీ ఒక్కరి కథలను బాగా చూపించి నడిపించారు కానీ కథానుసారం వచ్చే ట్విస్టుల విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉండాల్సింది. ఇవన్నీ కాస్త నిరాశ కలిగించే అంశాలు అని చెప్పొచ్చు.
తీర్పు :
మొత్తమంగా చూసుకున్నట్టయతే జోహార్ చిత్రం ఆకట్టుకునే ఒక ఎమోషనల్ డ్రామా అని చెప్పాలి. తమ పర్సనల్ ఎజెండా కొరకు ప్రజల సమస్యలను గాలికొదిలేసి కొందరు రాజకీయ పార్టీలపై డైరెక్ట్ గా సెటైర్ తో చూపించారు. అలాగే దర్శకుడు ఎన్నుకున్న కాన్సెప్ట్ కానీ చూపించిన కథలు కానీ ఆకట్టుకుంటాయి. కానీ కాస్త నెమ్మదిగా సాగే సెకండాఫ్ కొంచెం ముందు గానే ఊహించగలిగే కొన్ని సన్నివేశాలు అలాగే ఇచ్చే ఓ సామాజిక సందేశం ద్వారా డీసెంట్ గా నడిచే ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.
123telugutv Rating : 3/5