Akhil 's Most Eligible Bachelor Movie Teaser | Latest Telugu Movie Update | Akhil Akkineni , Pooja Hegde | Most Eligible Bachelor Movie Latest Update | Bommarillu Bhaskar
Image Source - Twitter (GA2)
మిస్టర్ మజ్ను తరువాత అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే .ఈ మూవీ లో అఖిల్ క్లాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.అఖిల్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీ ని అల్లు అరవింద్ సమర్పణలో GA 2 బ్యానర్‌పై బన్నీవాస్, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేయడం జరిగింది.
అఖిల్ ఈ మూవీ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.టీజర్ లో పూజ ”నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం’ అని అంటోంది. టీజర్‌లో పూజ చాల అందంగా అలాగే తన డైలాగులు కొంచం వెరైటీగా ఉన్నాయి. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలని అఖిల్ అడిగితే ఆమె తిక్క తిక్క సమాధానాలు చెప్పి అఖిల్‌కు షాక్ మీద షాక్ ఇచ్చింది. ఇక అన్ని పనులు భర్తే చేయాలని, జాయింట్ ఫ్యామిలీ అంటే తనకు చిరాకని చెబుతుంది.మొత్తానికి టీజర్ బాగుంది అఖిల్ లుక్ క్లాస్ గా బాగుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్.బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.