Keerthy Suresh Miss India Telugu Movie Review | Miss India Full Movie Review And Rating | Miss India Telugu Movie Watch Online Netflix
Image Source - Twitter
నటీనటులు : కీర్తి సురేష్, జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ
సంగీతం : థమన్
ఎడిటర్ : తమ్మిరాజు
నిర్మాత : మహేష్ కోనేరు
రచన మరియు దర్శకత్వం : నరేంద్రనాథ్
పెంగ్విన్ సినిమా తరువాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇండియాలో ఈ రోజే రిలీజ్ అయింది.
కథ :
మానసా సంయుక్త (కీర్తి సురేష్) ఒక మద్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. అయినా తాను చిన్నప్పటి నుండి బిజినెస్ చేయాలని కల కంటోంది. కానీ కొన్ని కారణాల వల్ల తన ఫ్యామిలీ మొత్తం అమెరికా వెళ్తారు. అయితే ఆమె అనుకున్నట్టుగా అమెరికాలో మిస్ ఇండియా అనే చాయ్ బిజినెస్ ను స్టార్ట్ చేస్తోంది. కానీ, అక్కడ కాఫీ బిజినెస్ పెట్టి బిజినెస్ లో టాప్ లో ఉన్న కైలాష్ (జగపతిబాబు) లాంటి ప్రత్యర్థులను తట్టుకుని ఆమె నిలబడిండా ? నిలబడి విజేతగా ఎలా గెలిసింది అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఒక హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీస్తున్నప్పుడు మరింత ప్లానింగ్ అలాగే పర్‌ఫెక్షన్‌తో వర్క్ చేయాలి.ఐతే కీర్తి సురేష్ ఈ విషయం లో చాల కేర్ తో ప్లాన్ తో సినిమా చేసింది. నటిగా తాను సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతూ ముందుకుసాగుతుంది.ఇంకో విషయం ఏమిటంటే ఈ సినిమా లో తన పాత్ర కోసం కీర్తి సురేష్ స్లిమ్ అయింది సినిమాలో కీర్తికి తల్లిగా నదియా, తండ్రిగా నరేష్, అన్నగా కమల్ కామరాజు చాల బాగా నటించారు.రాజేంద్ర ప్రసాద్ కీర్తికి తాతయ్య పాత్రలో నటించి మెప్పించారు. అలాగే నవీన్ చంద్ర, జగపతిబాబులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి రొటీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. ఎక్కడా మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దర్శకుడు నరేంద్రనాధ్ కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరీ బోర్ గా అనిపిస్తాయి.ఇక సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి. నిజానికి సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, తను అనుకున్న ల్యాగ్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. దాంతో సీన్స్ బోర్ గా సాగాయి.
తీర్పు :
మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం కొన్ని ఎలిమెంట్స్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ తో మరియు కీలక సన్నివేశాలతో ఆకట్టుకున్నా.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు బోర్ గా సాగే కథనం, అలాగే మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
123telugutv Rating : 2.25/5