కొన్నిరోజుల క్రితం జరిగిన ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకకు మెగా హీరోలంతా హాజరై అల్లు అర్జున్ రాకపోవడం అభిమానుల నడుమ పెద్ద చర్చకు దారితీసింది. మెగా కుటుంబానికి, బన్నీకి నడుమ మనస్పర్ధలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. దానికి తోడు ఇండస్ట్రీ మొత్తం ట్రైలర్ గురించి మాట్లాడినా అల్లు అర్జున్ స్పందిచలేదు. దీంతో అపోహలు మరింత ఎక్కువయ్యాయి.
వాటన్నిటికీ ఫులుస్టాప్ పెడుతూ తాజాగా బన్నీ రియాక్ట్ అయ్యారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిరంజీవిగారు చేస్తున్న గొప్ప చిత్రమన్న బన్నీ కొ న్నేళ్ల క్రితం ‘మగధీర’ సినిమా చూసినప్పుడు అలాంటి చిత్రంలో చిరంజీవిగారిని చూడానుకున్నా. సైరాతో నా కోరిక తీరింది. నిర్మాత, నా సోదరుడు రామ్ చరణ్ కు శుభాకాంక్షలు. ఒక కొడుకు తండ్రికి ఇచ్చే గొప్ప బహుమతి ఇది. దర్శకుడు సురేందర్ రెడ్డికి నా ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది అన్నారు.
బన్నీ హృదయపూర్వకంగా చెప్పిన ఈ మాటలతో మెగా కుటుంబంతో ఆయనకు ఎలాంటి గొడవలు లేవని, సినిమా పట్ల సగటు అభిమానిగా గొప్పగానే ఫీలవుతున్నాని అర్థమవుతోంది.