123telugu.com Review : సైరా నరసింహా రెడ్డి – ప్రేరణ కలిగించే ఎమోషనల్ ట్రీట్

Sye Raa movie review and rating

విడుదల తేదీ : అక్టోబర్ 02, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
నటీనటులు : చిరంజీవి, నయనతార,అమితాబ్ బచ్చన్, 
తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, రవి కిషన్,బ్రహ్మాజీ, బ్రహ్మానందం,నిహారిక తదితరులు.
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత‌లు : రామ్ చరణ్
సంగీతం :అమిత్ త్రివేది(సాంగ్స్) జూలియస్ పాకియం(బీజీఎమ్)
సినిమాటోగ్రఫర్ : ఆర్ రత్నవేలు
ఎడిట‌ర్‌ : శ్రీకర్ ప్రసాద్
మె

చి
హీ








మెగా పవర్స్టార్ రాoచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సైరా’ కోసం మెగా అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సైరా’ చిత్రం భారీ అంచనాలతో అట్టహాసంగా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ దళం చేసే అన్యాయాలకు అక్రమాలకు ఎదురుతిరగలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు (పాలెగాడు) ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి(చిరంజీవి) బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకోబోతున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. ఈ క్రమంలో నరసింహా రెడ్డి తను ఇష్టపడిన లక్ష్మి (తమన్నా)ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. కానీ తనకు చిన్నప్పుడే సిద్దమ్మ (నయనతార)తో పెళ్లి అయిపోయింది అని నరసింహా రెడ్డికి తెలుస్తోంది. ప్రజల కోసం తన ప్రేమను త్యాగం చేసిన నరసింహా రెడ్డి, దేశం స్వేచ్ఛ కోసం కుటుంబాన్ని కూడా దూరం చేసుకుంటాడు. అలా బ్రిటిష్ వాళ్ళ పై తన పోరాటాన్ని ముమ్మరం చేసి.. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి.. దేశ స్వాతంత్య్రం కోసం పెద్ద ఉద్యమాన్నే నడుపుతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం నరసింహా రెడ్డి బ్రిటిష్ వాళ్ళను ఎలా ఎదురుకున్నాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న పరిణామాలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? నరసింహా రెడ్డి పోరాటం ఆ తరువాత ఎవరెవరికి స్ఫూర్తిని నింపింది? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :

స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో అత్యంత భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ విజువల్స్ తో వచ్చిన ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్, అమితాబ్ లతో పాటు మిగిలిన స్టార్ల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ అలాగే భావోద్వేగమైన ఎమోషన్స్, మరియు డైలాగ్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే నటీనటులు గెటప్స్ వారి పాత్రల తాలూకు ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి ప్రతి ఫ్రేమ్ అలరించేవిధంగా సాగింది.
ఇక చారిత్రక పాత్రలో నటించిన మెగాస్టార్ అద్భుతమైన నటనతో హృదయాలను కదిలించేలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అత్యద్భుతంగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో తీవ్రమైన భావోద్వేగాలను పండించారు. అలాగే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా తన పరిపక్వతమైన నటనతో ఉత్తమమైన నటనను కనబర్చారు. అదేవిధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా తమ నటనతో మెప్పిస్తారు.
ప్రధాన పాత్రల్లోనే ముఖ్యమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్స్ నయనతార, తమన్నా తమ నటనతో ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించారు. కాగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. మెయిన్ గా ఒక పాత్రకి మరో పాత్రకు మధ్య మంచి వైవిధ్యాన్ని చూపిస్తూ.. ప్రతి పాత్రను కథలో కలిసిపోయేలా ప్లే రాసుకోవటం బాగా ఆకట్టకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో హై యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ప్రేరణ కలిగంచే సీన్స్ తో సాగే ఈ సినిమా చాల వరకు ఆకట్టుకున్నా.. కథ పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.
అలాగే సినిమాలో హై యాక్షన్ సీక్వెన్స్ తో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ తో ప్లేని రాసుకున్న దర్శకుడు.. దాన్ని సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా మెగాస్టార్ మార్క్ యాక్టింగ్ ఎక్కువుగా ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం కొంతవరకు నిరాశ తప్పదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే… రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని వార్ సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా ఆయన కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అమిత్ త్రివేద్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అలాగే జూలియస్ పాకియం అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాత రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో అత్యంత భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ విజువల్స్ తో వచ్చిన ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం అన్ని రకాలుగా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. అయితే కథ పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. కానీ, దర్శకుడు సురేందర్‌ రెడ్డి సైరాను అద్భుతమైన యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలతో చాల గొప్పగా తెరకెక్కించాడు. అన్నిటికి మించి మెగాస్టార్ చిరంజీవి తన నటనతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. అలాగే మిగిలిన భారీ తారాగణం కూడా అద్భుతమైన నటనను కనబర్చారు. ఓవరాల్ గా ‘సైరా’ ప్యాన్ ఇండియా మూవీగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా మంచి ప్రేరణ కలిగించే యాక్షన్ అండ్ ఎమోషనల్ విజువల్ ట్రీట్ లా అనిపిస్తోంది.
123telugutv.in Rating : 3.5/5
Reviewed by 123telugutv Team

Post a Comment