whistle telugu movie review 123telugu
‘తెరి’ (పోలీస్), ‘మెర్సల్’ (అదిరింది) వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరవాత దళపతి విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘బిజిల్’ (విజిల్). నయనతార హీరోయిన్. కతిర్, యోగిబాబు, వివేక్, జాకీష్రాఫ్, ఇందుజా రవిచంద్రన్, ఆనంద్ రాజ్, మోనికా జాన్ తదితరులు నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అఘోరం కల్పతి సుబ్రమణ్యన్ నిర్మించారు. తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేష్ ఎస్. కోనేరు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దీపావళి సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది.Also Read: ‘ఖైదీ’ ట్విట్టర్ రివ్యూ.. థ్రిల్లర్ అదిరింది
Karthi Khidi Telugu Movie Review
Malli Malli Chusa Telugu Movie Review and Ratting
Operation Gold Fish Telugu Movie Review and Ratting
Krishnarao Super Market Telugu Movie Review and Ratting
Raju Gari Gadi 3 Telugu Movie Review and Ratting
ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో నటించారు. ఒకటి తండ్రి పాత్ర రాయప్పన్.. రెండోది కొడుకు పాత్ర మైఖేల్ అలియాస్ విజిల్. ఒక ఛాంపియన్ ఫుట్‌బాలర్ జీవితం తన స్నేహితుడి మరణంతో ఎలా మలుపు తిరిగింది.. ఆ తరవాత అతను మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా ఎందుకు వెళ్లాడు.. ఆ క్రమంలో అతనికి ఎదురైన అవరోధాలు ఏంటి అనేది సినిమా ప్రధానాంశం. ఈ కథకు యాక్షన్, ఎమోషన్స్, డ్రామాను జోడించి ఒక కమర్షియల్ మూవీగా తీర్చిదిద్దారు అట్లీ. దీనికి తోడు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రాయప్పన్ క్యారెక్టర్ సినిమాకు మరో బలం. ఇదీ క్లుప్తంగా సినిమా గురించి.
ఇదిలా ఉంటే, ‘బిజిల్’ సినిమా ప్రీమియర్ షోలు విదేశాల్లో ఇప్పటికే ప్రారంభమైపోయాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇప్పటికే సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే, ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కొంత మంది సినిమా సూపర్ డూపర్ హిట్ అంటుంటే, కొంత మంది మాత్రం అస్సలు బాగాలేదని, పూర్తిగా నిరూత్సాహపరిచిందని ట్వీట్లు చేస్తున్నారు. అయితే, సినిమా గురించి పూర్తి నెగిటివ్‌గా ట్వీట్లు చేసేది అజిత్ ఫ్యాన్స్ అనే ఆరోపణ కూడా వస్తోంది.
పాజిటివ్ టాక్ బట్టి చూస్తే.. ఫస్టాఫ్ అదిరిపోయిందట. రాయప్పన్ క్యారెక్టర్‌ను అట్లీ అద్భుతంగా డిజైన్ చేశారని అంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ అయితే విజయ్ అభిమానులకు కన్నులపండువేనని టాక్. విజయ్ కెరీర్‌లో రాయప్పన్ పాత్ర ది బెస్ట్ అని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. నయనతార చాలా క్యూట్‌గా ఉందని అంటున్నారు. ఇక మైఖేల్ పాత్రలో విజయ్ ఎప్పటిలానే చాలా హుషారుగా తన మ్యానరిజంతో అలరించారట. ‘వెర్రెక్కిద్దాం’ సాంగ్ అయితే థియేటర్‌లో ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఖాయం అంటున్నారు. రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో బలమట.
అయితే నెగిటివ్ టాక్ ప్రకారం.. సినిమా ఉత్త దండగ. ముఖ్యంగా సినిమా చాలా లెంగ్తీగా ఉండట. ప్రతి సన్నివేశం ముందుగానే ఊహించి చెప్పేసే విధంగా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. చాలా బోరింగ్ అని.. ఫుట్‌బాల్ పేరుతో రియలిస్టిక్‌గా లేని సన్నివేశాలను చూపించారని కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్క్రీన్‌ప్లే కూడా యావరేజ్‌గా ఉందని.. అట్లీ చిరాకు తెప్పించేశాడని మరికొంత మంది అభిప్రాయం. మొత్తంగా కొంత మంది వన్ టైమ్ వాచబుల్ అంటుంటే.. ఇంకొంత మంది డిజాస్టర్ అంటున్నారు. తొలి రోజు గడిస్తే గానీ ‘విజిల్’ అసలు టాక్ ఏంటో చెప్పలేం. ఈ మిక్స్‌డ్ టాక్ ఎలా ఉన్నా తొలిరోజు విజయ్ బాక్సాఫీసును ఊపేయడం ఖాయం.