‘రజిని’కి కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడా ?

‘రజిని’కి కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడా ?

మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ షూటింగ్ ముగించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన 168వ సినిమాను కూడా సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి దర్శకుడు శివ పట్ల ఆసక్తి చూపుతూ వచ్చిన రజనీ ఎట్టకేలకు డైరెక్టర్ శివతో ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నారు. కాగా తాజాగా తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు వీరి సినిమా నవంబర్ రెండో వారంలో పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. రజనీ అభిమానులు, సినీ ప్రేక్షకులు వీరి కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది ప్రత్యేక శైలి. మాస్, క్లాస్ రెండు వర్గాల చేత విజిల్ వేయించగలిగే ట్రీట్మెంట్ ఇవ్వగలడు.
కాగా గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత తమిళ స్టార్ అజిత్ తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు. కాగా ఇప్పుడు రజిని – డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.

Post a Comment