123 telugutv.in 2.25/5
నటీనటులు : రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త
దర్శకత్వం : రవిబాబు
నిర్మాతలు : దిల్ రాజు
సంగీతం : వైద్ద్య్
సినిమాటోగ్రఫర్ : సుధాకర్ రెడ్డి
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్
నటీనటులు : రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త
దర్శకత్వం : రవిబాబు
నిర్మాతలు : దిల్ రాజు
సంగీతం : వైద్ద్య్
సినిమాటోగ్రఫర్ : సుధాకర్ రెడ్డి
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్
వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో అంతా కొత్తవారితో రాబోతున్న సినిమా ‘ఆవిరి’. సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు సమర్పణలో ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
రాజ్ కుమార్ రావు (రవిబాబు) తన భార్య లీనా( నేహా చౌహాన్) మరియు కూతుర్లు శ్రేయ, మున్నిలతో హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్న క్రమంలో.. ఓ ప్రమాదంలో పెద్ద కూతురు శ్రేయ చనిపోతుంది. దాంతో ఆ ఇంట్లో ఉంటే శ్రేయనే గుర్తుకు వస్తుందని.. ఒక పాత పెద్ద బంగ్లాలోకి ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు. అయితే ఆ ఇంట్లో మున్ని తనతో ఎవరో (దెయ్యం) మాట్లాడుతున్నట్లు బిహేవ్ చేస్తోంది. చివరికి ఆ దెయ్యం సాయంతో ఇల్లు వదిలిపోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అసలు మున్ని ఎందుకు ఇల్లు వదిలి వెళ్లిపోవాలనుకుంది ? ఈ క్రమంలో రాజ్ కుమార్, లీనా ఏం చేశారు ? ఇంతకీ మున్నితో మాట్లాడుతున్న ఆ దెయ్యం ఎవరు ? ఆ దెయ్యానికి రాజ్ కుమార్ కి సంబంధం ఏమిటి ? ఆ దెయ్యం దేని కోసం రాజ్ కుమార్ ఫ్యామిలీని టార్గెట్ చేసింది ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సంబంధం లేకుండా బిహేవ్ చేస్తూ.. ఆపదలో చిక్కుకున్న కూతుర్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో వచ్చే సీన్స్ అలాగే క్లైమాక్స్ లో భార్య ప్రాణం మీదకు వచ్చిన సందర్భంలో కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేస్తూ.. చెప్పే చిన్న ప్లాష్ బ్యాక్.. ఇక సినిమాలో అక్కడక్కడా రేర్ గా ఆకట్టుకునే కొన్ని హారర్ ఎలిమెంట్స్ .. ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
అలాగే రవిబాబు తన దర్శకత్వ పనితనంతో ఆవిరిలో కొన్ని చోట్ల ఆకట్టుకుంటాడు. సినిమాలోని ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే హర్రర్ సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ఇక రవిబాబుతో పాటు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన నేహా చౌహాన్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు రవిబాబు రాసుకున్న కథ కథనంలో పెద్దగా ఇంట్రస్ట్ లేకపోవడం, పైగా చాల సన్నివేశాలను అనవసరమైన ల్యాగ్ తో సాగతీయడంతో ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని కూడా నీరుగార్చాడు. మొత్తానికి దర్శకుడు సినిమాలోని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ను పక్కన పెట్టి.. వర్కౌట్ కానీ హారర్ ఎఫెక్ట్స్ తో అండ్ ఆసక్తిగా సాగని ఫ్యామిలీ సీన్స్ తో సినిమాని నడిపారు.
అసలు సినిమాలో ఇప్పుడు ఏమవుతుందో అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ అండ్ టెన్షన్ ను ఎలివేట్ చేసే అవకాశం చాలా చోట్ల ఉన్నా… దర్శకుడు మాత్రం ఆ కంటెంట్ ను పెద్దగా వాడుకోకుండా విషయం లేని సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశాడు.అన్నిటికి మించి సినిమా మొత్తం ఒకే పాయింట్ మీద ఒకే చోట సాగడం కూడా ప్రేక్షకులకు అంతగా రుచించదు.
అలాగే కొన్ని సన్నివేశాల్లో నాటకీయత కూడా ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. రవిబాబు స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది. ఓవరాల్ గా సినిమా నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతోంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కెమెరామెన్ కెమెరా పనితనం హార్రర్ సన్నివేశాలల్లో బాగుంది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం ఆకట్టుకోదు. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఆయన దర్శకుడు ఏది చెబితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిన్నట్లు అనిపిస్తోంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.
తీర్పు :
తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పచుకున్న రవిబాబు నుండి ఇలాంటి సినిమాని ఆశించలేం. ‘ఆవిరి’లో మెయిన్ థీమ్ తో పాటు కొన్ని హారర్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా మాత్రం బాగా స్లోగా సాగుతూ బోర్ గా కొడుతొంది. పైగా సినిమాలో చాల భాగం ఇంట్రస్ట్ కలిగించలేని రొటీన్ హారర్ తంతు వ్యవహారంతోనే సినిమా సాగడంతో ఆవిరి తేలిపోయింది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.