మెగాస్టార్ అభిమానుల ఊహల్లోని డ్రీమ్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఒకటి. ఎప్పటికైనా త్రివిక్రమ్ తో చిరు సినిమా చేస్తే చూడాలనేది వారి కోరిక. ఆ కోరిక త్వరలోనే తీరేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవికి త్రివిక్రమ్ గతంలో ఒక లైన్ చెప్పాడని, అయితే ఇప్పటికే ఆ లైన్ కి సంబంధించి స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ పూర్తి చేశారని.. త్వరలోనే త్రివిక్రమ్ ఫుల్ స్క్రిప్ట్ చిరుకి చెబుతాడని తెలుస్తోంది. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా వంద శాతం ఎంటెర్టైనర్ అట. ఎలాగూ త్రివిక్రమ్ సినిమా అంటే హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే.
పైగా హాస్యాన్ని పండించడంలో చిరు నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఎంటెర్టైనర్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికే థ్రిల్ అనిపిస్తోంది. ఇకపోతే చిరు తన తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారట. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట.