ఆర్ ఆర్ ఆర్ లో సూపర్ స్టార్ మహేష్ ,అమితాబ్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.
ఐతే ఈ సినిమాకు సమందించిన ఒక కొత్త అప్డేట్ బయటకు వచ్చింది .జక్కన ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు,అమితాబ్ బచ్చన్ తో చర్చల జరుపుతున్నట్లు టాక్ .
అసలు విషయం ఏమిటంటే జక్కన వీరిద్దరి చేత బ్యాక్డ్రాప్ లో వాయిస్ ఓవర్ చేపించాలనుకుంటూన్నారట .ఆర్ ఆర్ ఆర్ సినిమా తెలుగు తో పాటు అనేక భాషల్లో విడుదల అవుతున్నా విషయం తెలిసిందే .హిందీ వెర్షన్ కు బాలీవుడ్ బాదుషా అమితాబ్ తో అలాగే తెలుగులో మహేష్ బాబు తో వాయిస్ ఓవర్ చేపిస్తారను సమాచారం .తమిళ్ మరియు మలయాళం భాషల్లో అక్కడ స్టార్స్ తో వాయిస్ ఓవర్ చెప్పిస్తారన్నమాట .
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బాలీవుడ్ తారలు ఐనా అలియా బట్ ,అజయ్ దేవగన్ నటిస్తున్నారు .
అజయ్ దేవగన్ ఇటీవలే ఏ చిత్రం షూటింగ్ లో జాయిన్ ఐయ్యారు .అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది .
ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.
ఇ సినిమాను జులై 30 న విడుదల చేయనున్నారు .