విజయ్ సత్తానే వేరు భయ్యా Vijay Master Movie Update - Master Movie First Look Thalapathy Vijay - Lokesh Kanagaraj - #Master
తమిళ దళపతి విజయ్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట రజినీ,కమలహాసన్ కి సరి సమానమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడీ హీరో. విజయ్ వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు విజయ్.. చివరగా బిగిల్ (తెలుగులో విజిల్) సినిమా తో అటు తమిళ్ ఇటు తెలుగు లో మోతమోగించాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300కోట్ల కొల్లగొట్టినట్టు సినిమా నిర్మాత ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ నిత్యం వార్తల్లో నిలుస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు
తాజాగా విజయ్‌పై ఐటీ రైడ్స్ అనే ఈ వార్త గత కొన్ని రోజులుగా బాగా హల్‌చల్ చేస్తుంది . బిగిల్ మూవీ బాక్సాఫీస్ లెక్కల్లో అవకతవకలు, ఆయన రెమ్యూనరేషన్‌లోనూ తప్పుడు లెక్కలు ఉండటం, ఆదాయ పన్ను ఎగవేస్తున్నారనే కారణాలతో బిగిల్ చిత్రి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్స్, హీరో ఇలా అందరి పై ఐటీ రైడ్స్ చేశారు.
ఐతే ఫాన్స్ మాత్రం విజయ్‌పై కావాలనే ఐటీ రైడ్స్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి, ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నాడని కక్షగట్టి ఈ దాడులు చేస్తున్నారంటూ ఫాన్స్ అలాగే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
విజయ్ ప్రస్తుతం ఖైదీ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాష్టర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సమీపంలోని నైవేలీ ప్రాంతంలో మాష్టర్ షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగానే.. ఐటీ రైడ్స్ చేశారు.
అయితే తాజాగా విజయ్ తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తన అభిమానలతో దిగిన ఆ సెల్ఫీతో.. తనపై కుట్రపూరితమైన చర్యలు చేస్తున్న వారికి తన బలమేంటో అందరికీ చూపెడుతున్నాట్టు ఉంది అని కామెంట్స్ విసురుతున్నారు. ప్రస్తుతం నైవేలీ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ రోల్‌ను పోషిస్తున్న సంగతి తెలిసిందే.వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది .
master first look
master movie first single
master movie new update
master new update
vijay incometax ride
vijay it rides
vijay master movie update
vijay new movie update
0 Comments