World Famous Lover First Day Collections - World Famous Lover Movie Collections Vijay Devarakonda
World Famous Lover Collection - Vijay Devarakonda Kranthi Madhav Rashi Khanna
![]() |
World Famous Lover Collections |
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు డైరెక్టర్ క్రాంతి మాధవ్ తాజాగా తీసిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా చేయగా రాశీ ఖన్నా, కేథరీన్ త్రెసా, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా నిన్న వరల్డ్ వైడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్‌డే కలెక్షన్స్ చూస్తే తొలిరోజు బాగానే కొట్టాడు విజయ్.ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1150 స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా రూ.6.5 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు .
బాక్సాఫీస్ వద్ద ఆక్యుపెన్సీ రేట్ 70.19 శాతం ఉందట. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్‌డే రూ.8 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ థియేట్రికల్ రైట్స్ రూ.23.81 కోట్లకు అమ్ముడుపోయింది. ఇకపోతే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమానే తన చివరి ప్రేమ కథా చిత్రం అని విజయ్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు. ఇక నుంచి లవ్ స్టోరీలు చేయనని చెప్పాడు. ‘‘నా సినిమాకి వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక కొత్త అనుభూతిని పొందాలనే సినిమాలు చేస్తుంటా.. ఈ సింగిల్ డబుల్స్ కొట్టడం మన వల్ల కాదు.. కొడ్తే సిక్సే.. ప్రతి బాల్ని బౌండరీ బాదాలనే చూస్తా.
ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో బంతిని గట్టిగానే కొట్టా.. బంతి గాల్లో ఉంది.. మరి అది బౌండరీ బయటపడిందో.. క్యాచ్ ఔట్ అయ్యిందో సినిమా చూసి చెప్పాలి’ అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు విజయ్ దేవరకొండ.ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించిన కల్లెక్షన్ల్ మాత్రం బాగానే వచ్చాయి.దీనికి తోడు ఏ సినిమా ఇప్పుడు రిలీజ్ కి లేకపోవడం సినిమాకి బాగా ప్లస్ పాయింట్ . ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ విషయానికొస్తే సినిమాలో క్రెడిట్ మొత్తం ఐశ్వర్య రాజేష్ పెర్ఫామెన్స్కి దక్కింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ రాశీ ఖన్నానే అయినప్పటికీ.. సువర్ణ పాత్రలో ఐశ్వర్య ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యకు తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి .
aishwarya rajesh
kranthi madhav
rashi khanna
vijay devarakonda
world famous lover collection
world famous lover collections
world famous lover full movie
world famous lover movie collection
0 Comments