Jr NTR About Janatha Curfew - Jr NTR Latest News - RRR Movie Latest Update
![]() |
Jr NTR - RRR Movie |
కరోనా వైరస్ ఇప్పుడు మొత్తం ప్రపంచం వణికిస్తుంది .మొత్తం ప్రపంచం కరోనా వైరస్ గుపిట్లో ఉంది . ఒక రకమైన భయానిక వాతావరణాన్ని సృష్టించింది. దాంతో కరోనా కలకలంతో ప్రపంచ దేశాలు హడలెత్తిపోతున్నాయి.అటు అన్ని దేశాల ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా కరోనా పట్ల ప్రజలలో ఒక అవగహన తీసుకొస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని సామజిక మాధ్యమాల ద్యారా తెలియజేస్తున్నారు .మన ప్రధాని మోడీ పిలుపు మేరకు రేపు జనతా కర్ఫ్యూ ని కూడా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.
ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ ఈ జనతా కర్ఫ్యూ గురించి ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. ‘కరోనాని జయించాలంటే అందరం మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’ అని ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇక ఇప్పటికే ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని అలాగే సురక్షితంగా ఉండాలని ఈ వీడియోలో ఎన్టీఆర్ తెలిపారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు . ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.
ఈ సినిమాను 2021 జనవరి 8 న విడుదల చేయనున్నారు .