Mahesh Babu 27 Movie Update - Keerthy Suresh Parasuram -Telugu Movie News
![]() |
Mahesh Babu New Movie |
Mahesh Babu New Movie Details -
మహేష్ బాబు ఫాన్స్ కి పండగలాంటి వార్త - మహేష్ బాబు తాజాగా సరిలేరు నీకెవ్వరు మూవీ తో వచ్చి సంక్రాంతి కి హిట్ కొట్టాడు.మహేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నడు.అందరు మహేష్ తరువాత సినిమా ఎవరితో చేస్తారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఐతే తనకు 'మహర్షి' వంటి మంచి విజయం అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్లు, దిల్ రాజు నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కానీ వంశీ పైడిపల్లి సిద్ధం చేసిన స్క్రిప్ట్‌లో మహేష్‌కు కొన్ని అనుమానాలు ఉండటంతో దర్శకుడు వంశీ వాటిని తీర్చే పనిలో బిజీగా ఉన్నాడట. మహేష్ ఇమేజ్‌కు సరిపోయేలా ఈ కథ సిద్ధం చేయడానికి దర్శకుడు వంశీ పైడిపల్లికి చాలా సమయమే పడుతుందని పట్టాలెక్కడం కష్టమే అంటున్నారు. దీంతో మహేష్ మరో దర్శకుడితో తన తదుపరి సినిమా మొదలుపెట్టనున్నాడు. అందులో భాగంగా మహేష్ తన 27వ సినిమాను సోలో మరియు గీత గోవిందం మూవీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం కీర్తి ప్రస్తుతం తెలుగులో ‘మిస్ ఇండియా, రంగ్ దే’ సినిమాల్లో నటిస్తోంది. వీటికి తోడు రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీర్తి కీలక పాత్రలో నటిస్తోంది.