బంగార్రాజు గా వస్తున్నా నాగార్జున - Nagarjuna New Movie Update - Akkineni Nagarjuna - Bangarraju First Look
Bangarraju First Look - Bangarraju Movie Update
![]() |
Akkineni Nagarjuna |
మన్మధుడు అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కూడా ముందు వరసలో ఉంటుంది. 2015 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల్ని,ఇటు కుర్రకారుని ఒక ఊపు ఊపి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున క్యారక్టర్,యాక్టింగ్ సినిమాకే హైలెట్ గ నిలిచింది . అయితే ఈ చిత్రంలో నాగార్జున చేసిన ‘బంగార్రాజు’ పాత్రకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య ఇద్దరితో కలిసి ఈ సినిమానికి సీక్వెల్ తీయబోతున్నారు. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది.
జూన్ మొదటి వారంలో సినిమాను మొదలుపెట్టి, క్రిష్టమస్ కి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది.ప్రస్తుతం డైరెక్టర్ బంగార్రాజు స్క్రిప్ట్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. మరి నాగ్ ఈ సారి మల్లి ఊపుతాడో లేదో చూడాలి. అయితే గత సినిమా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వచ్చిన `మన్మథుడు 2′ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ అయిన సంగతి తెలిసింది. దాంతో నాగార్జున తన తరువాత సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.
akkineni nagarjuna
nagarjuna latest movie news
nagarjuna movies
nagarjuna new movie
nagarjuna new movie first look
nagarjuna new movie title
nagarjuna new movie update
0 Comments