Nirbhaya Convicts Hanged Today - Nirbhaya Case Latest News - Nirbhaya Case Live
![]() |
Nirbhaya Case Update |
2012 డిసెంబర్ 16 న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి కేసు నిర్భయ .ఢీల్లీ లో నిర్భయ అనే వైద్య విద్యార్థిని నలుగురు నరరూప రాక్షసుకు అత్యంత క్రూరంగా రేప్ చేసి హత్య చేసారు.చాల కాలంగా వారి శిక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నిర్భయ హత్యకేసును సంబంధించిన నిందితులకు ఉరి పడింది. ఈ రోజు ఉదయం 5:30 గంటలకు తీహార్ జైలు అధికారులు ఆ నలుగురి నిందితులకు ఉరి శిక్ష అమలు చేశారు. కాగా ఉరి తీయడానికి ముందు వారికి కొన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. కాగా ఆ నలుగురి ఆరోగ్య పరిస్థితి సరిగ్గానే ఉందని నిర్దారించిన వైద్యులు, ఆ తరువాత వారిని ఉరి తీయడానికి అనుమతిచ్చారు. కాగా ఈ ఈ ఉరితీత ప్రక్రియలో భాగంగా జైలులో కానీ, జైలు పరిసర ప్రాంతాల్లో కానీ ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
కాగా ఆ నిందితులను ఉరితీయడాని కని ప్రత్యేకంగా మీరట్ నుండి వచ్చినటువంటి తలారి పవన్ జల్లాడ్ నిర్భయ దోషులైన నలుగురిని ఉరితీశాడు. అయితే ఈ ఉరి శిక్ష నుండి తప్పించుకోడానికి ఆ నలుగురు నిందితులు కూడా చివరి వరకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించినట్లు కనిపించలేదు. అప్పటికే వారు చట్టపరంగా ఉన్న హక్కులన్నింటిని కూడా ఉపయోగించుకున్నప్పటికీ కూడా చివరి వరకు వివిధ రకాలుగా ప్రయత్నాలు కొనసాగించారు. ఇకపోతే నిర్భయ హత్యకు కారణమైనటువంటి నలుగురు నిందితులకు మరణ శిక్ష అమలు కావడంతో నిర్భయ తల్లిదండ్రులతోపాటు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.నిర్భయ ఆత్మకు శాంతి కలిగింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.