పెళ్లి పీటలు ఎక్కనున్న మహానటి - Mahanati Keerthy Kuresh Going To Marriage - Keerthy Suresh Husband
పెళ్లి పీటలు ఎక్కనున్న మహానటి
![]() |
Keerthy Suresh - Mahanati |
Keerthy Suresh Husband -
మన మహానటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అవును మీరు విన్నది నిజమే అంటున్నాయి సినీ వర్గాలు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తను కీర్తి పెళ్లిచేసుకోబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు వారు ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నారని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునేందుకు కీర్తి కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. వివాహ వేదిక, పెళ్లి తేదీ తదితర విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్‌కు ఓ ప్రముఖ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యాపారవేత్తతో కీర్తి వివాహాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో రంగ్‌దే, గుడ్‌లక్ సఖి, మిస్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. అయితే కీర్తి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏడు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఈ క్రమంలో ఆమె 20కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక మహానటి చిత్రానికి గానూ కీర్తికి జాతీయ అవార్డు కూడా వచ్చింది.
keerthi suresh husband
keerthy suresh
keerthy suresh age
keerthy suresh height
keerthy suresh latest news
keerthy suresh marriage
keerthy suresh marriage update
keerthy suresh movies
0 Comments