Kerala: 12ఏళ్ల బాలికను ప్రియుడు రేప్ చేస్తుంటే వీడియోలు తీసిన ఫ్రెండ్స్

Kerala: 12ఏళ్ల బాలికను ప్రియుడు రేప్ చేస్తుంటే వీడియోలు తీసిన ఫ్రెండ్స్
కేరళలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చిది. 12ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మచ్చిక చేసుకున్న ఓ యువకుడు ఆమెను పక్కింట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తప్పని చెప్పాల్సిన స్నేహితులు అతడిని ఎంకరేజ్ చేస్తూ వీడియోలు తీస్తూ పైశాచికానందం పొందారు. బాధితురాలి ఫిర్యాదులో ఆ ముగ్గురు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.
కేరళలోని కొచ్చికి చెందిన 12ఏళ్ల బాలిక స్థానికంగా ఉండే లితిన్(19) అనే యువకుడిని ప్రేమిస్తోంది. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్ని లితిన్ కొద్దిరోజుల క్రితం ఆమెను తన ఫ్రెండ్స్ రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ బాలికను బలవంతపెట్టి లైంగిన దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతడి స్నేహితులు బిబిన్, వర్ష సెల్‌ఫోన్లో వీడియోలు తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియో బయటపెడతామని నిందితులు బాలికను బెదిరించారు.
కొద్దిరోజుల తర్వాత ఆ కామాంధులు వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడాన్ని బాలిక గమనించి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment