ఎన్టీఆర్ కోసం ఆ డైరెక్టర్ రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తాడా ? - Jr NTR New Movie Update - Telugu Movie News
Jr NTR And Prashanth Neel Movie Update - KGF 2 - RRR Movie
![]() |
Jr NTR - Prashanth Neel |
ప్రశాంత్ నీల్ దేశం లో ఈ దర్శకుడు పేరు తిలిన వాళ్ళు ఉండరు. అతను తీసిన కెజిఎఫ్ చిత్రంతో చాలా మందిని తన వైపుకు తిప్పాడు. KGF చాప్టర్ 1 మూవీ విడుదలైన అన్ని భాషలలో ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడు, ప్రశాంత్ నీల్ కెజిఫ్ చాప్టర్ 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీ ని అక్టోబరు లో విడుదల చేయాలనుకున్నారు కరోనా వైరస్ కారణం గా వాయిదా పడింది. ఇప్పుడూ ఈ చిత్రాన్ని సంక్రాంతి 2021 సీజన్లో విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. అంటే ప్రశాంత్ నీల్ ఫిబ్రవరి 2021 నుండి తన తరువాత మూవీ పై దృష్టి పెట్టవచ్చు. ప్రశాంత్ నీల్ తరవాత చిత్రం ముందుగా ప్రకటించినట్లు ఎన్టీఆర్ తో ఉంటుంది . మైత్రి మూవీ మేకర్స్ ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను నిర్మించనున్నారు. అయితే ఈ మూవీ సెట్స్ మీద కి వెళ్ళడానికి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది లో తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయ్ . కరోనా వైరస్ కారణంగా అన్ని మూవీ లో షూటింగ్ వాయిదా పడ్డాయి .అందులో ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి కి కరోనా పాజిటివ్ వచ్చింది . ఈ ప్రాజెక్ట్ తరువాత, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలిసి మరో మూవీ చేయనున్నారు . ఈ మూవీ తెరకెక్కడానికి ఎలా లేదన్న 10 నెలల వరకు పడుతుంది. కాబట్టి ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ 2022 రెండవ భాగం (జులై ) నుండి మొదలుకావొచ్చు. మరి ప్రశాంత్ నీల్ ఇంత కాలం వేచి ఉంటారా.కెజిఫ్ మూవీ లో యాష్ ను ఏవిధం గా చూపించారో మనకి తెలుసు ఫైట్స్ ,హీరో ఎలివేషన్ సీన్స్ అబ్బో ఒకటేంటి అన్ని ఓ రేంజ్ లో పేలాయి .ఇక ఎన్టీఆర్ తో మూవీ అంటే అది మాటల్లో చెప్పలేం .రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం .ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడి కోసం ఏడాది వెయిట్ చేయడం లో తప్పు లేదు అని అనిపిస్తుంది .
గమనిక :
మీకు నచ్చిన ట్విట్టర్,ఫేస్ బుక్, ఇంస్తగ్రం వీడియోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.అలాగే వాట్స్ యాప్ స్టేటస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ (మూవీస్)ను డౌన్లోడ్ చేసుకోండి.ఇంకా షేర్ చాట్, రోపొస్,చింగారి,జోష్ మరియు ఇతర స్టేటస్ యాప్స్ నుంచి వీడియోస్ ను వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వన్నీ ఒకే యాప్ లో ఇప్పుడే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. - Click Here
jr ntr new movie update
jr ntr latest movies
jr ntr prashanth neel movie update
kgf 2
movie updates
prashanth neel movies
rrr movie
rrr movie latest news
telugu movie news
0 Comments